AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కాకినాడ పోర్ట్లో తనిఖీలు చేశారు. పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పవన్ అధికారులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 'నేను తనిఖీలకు వస్తానంటే 10 వేల మంది జీవితాలు పొతాయ్ అంటున్నారు. పోర్టులున్నది స్మగ్లింగ్ చేయడానికా? సీజ్ ది షిప్' అని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పవన్ రంగంలోకి దిగితే ఇలాగే ఉంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.