Top 10 viral news 🔥
ఇంటిపై దీపావళి బాంబులతో దాడి చేసిన దుండగులు (వీడియో)
TG: మెదక్ జిల్లాలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రమేశ్ గౌడ్ ఇంటిపై గుర్తుతెలియని దుండగులు దీపావళి సుతిల్ బాంబులతో దాడిచేశారు. ఈ క్రమంలో ఇంటిపై నుంచి భారీగా శబ్ధం రావడంతో.. బాధిత కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇళ్లు పాక్షికంగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.