సంక్రాంతికి మరో నాలుగు ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే

62చూసినవారు
సంక్రాంతికి మరో నాలుగు ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. జనవరి 9న కాకినాడ టౌన్‌ - వికారాబాద్‌ (07205), 10న వికారాబాద్‌-శ్రీకాకుళం రోడ్‌ (07207), 11న శ్రీకాకుళం రోడ్‌ - చర్లపల్లి (07208), 12న చర్లపల్లి-కాకినాడ టౌన్‌(07206) మధ్య ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీదర్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్