పేర్ని నాని బియ్యం అక్రమాలపై విచారణకు ఫిర్యాదు
AP: పేర్ని నాని రేషన్ బియ్యం అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని టీడీపీ నేతలు బందరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పేర్ని నాని, ఆయన కుమారుడు అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై ఎందుకు ఫిర్యాదు చేయలేదో అధికారులను విచారించాలని డిమాండ్ చేశారు. గోదాము నిర్మాణం కూడా అవినీతి సొమ్ముతో నిర్మించిందని పేర్కొన్నారు. పేర్ని నాని, కిట్టు, వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.