TG: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నార్సింగ్ సమీపంలోని అల్కపూరి కాలనీకి చెందిన రోహిత్ అనే యువకుడిని బర్త్ డే పార్టీకి పిలిచి.. తన స్నేహితులు బీర్ బాటిల్‌తో తలపై మోదీ హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పథకం ప్రకారమే హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. కాగా, హంతకుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.