భారత్‌లో మహిళలు ప్రధానంగా పురుషుల నుంచే సమస్యలను ఎదుర్కొంటున్నారని ఓ నివేదిక వెల్లడించింది. అది వృత్తిపరంగా, వ్యక్తిగతంగా వారి అధికారం వలనే ప్రతిరోజు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారట. అలాగే అనేక ఆంక్షల కారణంగా మహిళలు వెనుకబాటుతనానికి గురవుతున్నారని, ఇది ఎక్కువగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో కనిపిస్తుందని పేర్కొన్నారు. అలాగే లింగ వివక్షత, నిరక్షరాస్యత, స్త్రీ శిశుహత్య, వరకట్న వ్యవస్థ ప్రధాన ఆటంకాలుగా మారాయి.