కోవిషీల్డ్‌పై పిటిషన్‌ను అంగీకరించిన సుప్రీంకోర్టు

68చూసినవారు
కోవిషీల్డ్‌పై పిటిషన్‌ను అంగీకరించిన సుప్రీంకోర్టు
కరోనా వ్యాక్సిన్‌ కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్‌పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. విచారణకు తేదీని నిర్ణయించలేదు. అయితే ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ విచారణకు అంగీకరించారు. కోవిషీల్డ్‌ టీకా వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్‌పై దర్యాప్తు కోసం నిపుణుల బృందం ఏర్పాటు, మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించాలనే డిమాండ్లతో ఈ పిటిషన్‌ దాఖలైంది.