లైంగిక వేధింపుల కేసులో నటుడు సిద్ధిక్ పరార్.. లుక్ అవుట్ నోటీసులు జారీ
లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు సిద్ధిక్కి హైకోర్టు షాక్ ఇచ్చింది. సిద్ధిక్ ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో లైంగిక వేధింపుల కేసులో నటుడు సిద్ధిక్ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిద్ధమైంది. విమానాశ్రయాలలో సిద్ధిక్ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. నటుడు విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు ఇలా చేసినట్లు తెలుస్తోంది. సిద్ధిక్ను అరెస్టు చేయడంలో ఎలాంటి అడ్డంకి లేదని పోలీసులు తెలిపారు.