భారతదేశంలో అనేక పురాతన గుహలు ఉన్నాయి. అందులో కొన్ని గుహలు వాటి అందంతో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. వాటిలో మహారాష్ట్రలోని అజంతా, ఎల్లోరా గుహలు, బెడ్సే గుహలు,మధ్యప్రదేశ్‌లోని బాగ్ గుహలు, ఒడిశాలోని ఉదయగిరి, ఖండగిరి గుహలు, కర్ణాటకలోని బాదామి గుహలు ఉన్నాయి. అజంతా, ఎల్లోరా గుహలు భారతదేశంలోని పురాతన రాతి గుహల్లో ఒకటిగా ప్రాముఖ్యతను పొందాయి.