పుట్టే బిడ్డ జాతకం బాగుండాలని అనుకోవడంలో తప్పు లేదు. మంచి ముహూర్తంలో పుట్టాలని కోరుకోవడంలో తప్పు లేదు. పండుగలు, ప్రత్యేక రోజుల్లో సంతానం కావాలని ఆశించడంలో తప్పు లేదు. కానీ, అందుకోసం సిజేరియన్ల వైపు మొగ్గు చూపడం ఆందోళన కలిగిస్తున్నది. శిశువు గర్భంలో ఉండగానే ముహూర్తాలు పెట్టి.. ఆ సమయానికే సిజేరియన్లు చేయించే మూఢనమ్మకాల ధోరణి ఇటీవలి కాలంలో పెరుగుతోంది.