కొండా సురేఖ వ్యాఖ్యలు చాలా బాధించాయి: చిరంజీవి
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ సినీ నటుడు చిరంజీవి స్పందించారు. ఆ అమర్యాదకర వ్యాఖ్యలు చూసి తాను చాలా బాధపడ్డట్లు తెలిపారు. వార్తల్లో నిలిచేందుకు సినీ ప్రముఖులు, సెలబ్రిటీల పేర్లు వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని వాళ్లను ఇందులోకి లాగడం.. అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాజకీయ నాయకులు ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలని సూచించారు.