Apr 11, 2025, 02:04 IST/
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో సంస్కరణలు
Apr 11, 2025, 02:04 IST
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో TGPSC సంస్కరణలు చేసింది. రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 1:1 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేయనుంది. గ్రూప్-1 పోస్టుల భర్తీ ప్రక్రియలో ఈ విధానాన్ని అమలు చేయగా, త్వరలో మహిళా శిశు సంక్షేమశాఖలో భర్తీకీ ఇదే విధానం అవలంబించనుంది. కొత్త సంస్కరణ ప్రకారం ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైతే ఉద్యోగం వచ్చినట్లే.