Oct 03, 2024, 17:10 IST/పాలకుర్తి
పాలకుర్తి
రేపు తొర్రూరుకు హరీష్ రావు రాక..
Oct 03, 2024, 17:10 IST
తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేయాలన్న నేపథ్యంలో ధర్నాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తొర్రూరు పట్టణానికి మాజీ మంత్రి హరీష్ రావు రానున్నారు. సుమారుగా పదివేల మంది రైతులతో ధర్నా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో హరీశ్ రావుతో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.