Top 10 viral news 🔥
రైతులకు రూ.20,000.. మంత్రి కీలక ప్రకటన
AP: అన్నదాత సుఖీభవ (రైతు భరోసా) పథకం అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే రూ.6,000తో కలిపి రైతులకు ఏడాదికి రూ.20,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. పథకం విధివిధానాలు, మార్గదర్శకాలపై త్వరలోనే ఆదేేశాలు జారీ చేస్తామన్నారు. ఈ పథకం కోసం బడ్జెట్లో రూ.4,500 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.