Nov 01, 2024, 13:11 IST/
వైసీపీ వాళ్లకి చింత చచ్చినా పులుపు చావలేదు: పవన్ కళ్యాణ్
Nov 01, 2024, 13:11 IST
AP: ఏలూరు జిల్లాలోని జగన్నాథపురంలో జరిగిన దీపం పథకం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ వైసీపీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా వైసీపీ వ్యవహరిస్తోందన్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్లో వారి నోటిలోంచి మాటరాకుండా చేస్తాను. మేము త్రికరణ శుద్ధిగా పనిచేస్తుంటే వారు సోషల్మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలా చేస్తే తొక్కి నార తీస్తాం అని హెచ్చరించారు.