పిడుగు పడి రైతు మృతి
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం బత్తులపల్లి శివారులో మంగళవారం మొక్కజొన్న పంట చేను కాపలాకు వెళ్లిన దుర్గం లక్ష్మయ్య (65) అనే రైతుపై పిడుగు పడి మృతి చెందాడు. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షం కురిసింది. దీంతో లక్ష్మయ్య చెట్టు కింద నిలబడగా పిడుగు పడి మృతి చెందాడు.