Top 10 viral news 🔥
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి (వీడియో)
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తారాపూర్-ధర్మజ్ హైవేపై వడ్డల పాటియ సమీపంలో గురువారం ట్రక్కు, లగ్జరీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఇద్దరికీ తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతులను రాజ్‌కోట్‌కు చెందిన ధృవ్ రుడానీ, మన్సుఖ్భాయ్ కోరట్, కల్పేష్ జియానీగా గుర్తించారు.