Apr 11, 2025, 03:04 IST/
ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి!
Apr 11, 2025, 03:04 IST
తెలంగాణలో చిన్నారులపై అత్యాచార ఘటనలు ఆగడంలేదు. తాజాగా ఐదు సంవత్సరాల బాలికపై ఓ మానవ మృగం లైంగిక దాడికి పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఎలిగేడు మండలంలోని ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే గ్రామానికి చెందిన వ్యక్తి, ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు జూలపల్లి PSలో ఫిర్యాదు చేశారు. ఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాట్లు సమాచారం.