జెడ్పీ చైర్మన్ మృతికి సంతాపంగా ర్యాలీ

146చూసినవారు
జెడ్పీ చైర్మన్ మృతికి సంతాపంగా ర్యాలీ
ములుగు జిల్లా పరిషత్, చైర్మన్ ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కుసుమ జగదీష్ ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుతో అకాల మరణం. చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి సంతాప సూచితంగా వెంకటాపూర్ మండలం రామానుజాపురం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు, శ్రేయోభిలాషులు మంగళవారం సాయంత్రం కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అమరుడు జగదీష్ అన్నకు జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వెంకటాపూర్ ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ జగదీష్ అన్న మరణం టిఆర్ఎస్ పార్టీకి, ములుగు జిల్లా ప్రజలకు తీరని లోటు అని అన్నారు. అనతి కాలంలోనే జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి జిల్లా పరిషత్ చైర్మన్ గా, జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ మండల సోషల్ మీడియా కన్వీనర్ మునిగంటి నరేంద్ర చారి, వార్డు సభ్యులు భామండ్ల పెళ్లి అనిల్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కన్నూరు రవి, బైరెడ్డి శ్రీనివాసరెడ్డి, కంది యాదవ రెడ్డి, మాజీ సర్పంచ్ మారేపల్లి భద్రయ్య, మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు బుర్ర రాజు, గాదె భద్రయ్య, బుక్కరాజు శ్రీనివాస్, నడిగోటి రామానుజం, బుర్ర రమేష్, బొద్దుల రఘు, నిల్పూరి గట్టయ్య, నిలుపురి మొగిలి, ధర్మల లింగయ్య, కన్నూరి చేరాలు, కన్నూరి కుమార్, యూత్ నాయకులు బుక్కరాజు సందీప్, టిఆర్ఎస్ పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you