

ములుగు జిల్లాలో అర్దరాత్రి నుండి కురుస్తున్న వర్షం
ములుగు జిల్లాలోని అన్ని మండలాల్లో మంగళవారం అర్దరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పత్తి, వరి, మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతులు వర్షంతో బస్తాలు తడుస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది. పూర్తిస్థాయిలో కొనుగోళ్లు కాలేదని రైతులు వాపోయారు. మిరపకాయలు వర్షాలకు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.