Apr 11, 2025, 04:04 IST/
వరకట్న వేధింపులకు వివాహిత మృతి
Apr 11, 2025, 04:04 IST
AP: నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని ఊటుకూరు పెద్దపాళెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. హరికృష్ణ, సుగుణ (23)కు 2021లో పెళ్లి జరిగింది. అదనపు కట్నం తీసుకురావాలని భర్తతోపాటు అత్త నర్సమ్మ, మామ నాగూరు, ఆడపడుచు నాగలక్ష్మి కలిసి సుగుణను వేధించేవారు. దాంతో మనస్తాపానికి గురైన సుగుణ ఇంటి ముందు చల్లే కల్లాపిరంగు పొడిని నీళ్లలో కలిపి తాగింది. సుగుణను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.