పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు (వీడియో)
AP: అనకాపల్లి జిల్లా పరవాడలోని మెట్రో కెం ఫార్మా కంపెనీలో ఇవాళ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కార్మికులు షిఫ్ట్‌కు వెళ్తున్న క్రమంలో ఏటీపీ సాల్వెంట్స్ ట్యాంక్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. కంపెనీలో వరుస ప్రమాదాలతో స్థానికులు, కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు.