‘నా భర్త లేకపోతే నేను చనిపోతా’.. యువకుడు ఇంటి ముందు యువతి ధర్నా

66చూసినవారు
AP: పెళ్లి చేసుకుని మోసం చేశాడని భర్త ఇంటి ముందు భార్య ధర్నా చేసింది. ఈ ఘటన ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో చోటు చేసుకుంది. ‘నా పేరు మర్రి ప్రణీత. నా భర్త ఉందుర్తి నవీన్ కుమార్. రెండేళ్లుగా ప్రేమించుకున్నాం.  గతేడాది ఏప్రిల్‌ 7న విజయవాడలో పెళ్లి చేసుకున్నాం. తర్వాత మా అత్త వారింటికి తీసుకెళ్లారు. ఇప్పుడు నా కుటుంబానికి నువ్వు వద్దు, కట్నం ఇస్తే కాపురానికి రమ్మన్నాడు. నా భర్త లేకపోతే నేను చనిపోతా’ అని ఆవేదన వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్