వివేకా హత్య కేసు.. అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
AP: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ నేత, ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి నోటీసులు ఇచ్చింది. కాగా, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత వేసిన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది.