ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దు
ఏపీలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దైంది. ఈ నెల 29న జరగాల్సిన మోదీ పర్యటన తుఫాను హెచ్చరికల కారణంగా రద్దైనట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ పర్యటనలో భాగంగా అనకాపల్లి పూడిమడకలోని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ శంకుస్థాపన, కొన్ని రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులను జాతికి అంకితం చేయాల్సి ఉంది. అలాగే ఏయూ కళాశాల మైదానంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించాల్సి ఉంది.