మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ

69చూసినవారు
మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ
AP: ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థుల నైతిక విలువల సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్‌తో నేడు ఉండవల్లిలో చాగంటి భేటీ అయ్యారు. మహిళలు, పెద్దలు, గురువులపై విద్యార్థుల్లో గౌరవం పెంపొందించేలా పాఠ్యాంశాలను రూపొందించాలని నిర్ణయించినట్లు లోకేష్ తెలిపారు. దీనికోసం మీ వంటి పెద్దల సలహాలు అవసరమని చాగంటికి చెప్పగా.. తన వంతు సహకారం అందిస్తానని ఆయన తెలిపినట్లు లోకేష్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్