దసరాకు 6 వేల ఆర్టీసీ స్పెషల్ బస్సులు
దసరా సందర్భంగా టీజీఆర్టీసీ ఆరు వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 'నేటి నుంచి 15 వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. వీటిలో ముందస్తు రిజర్వేషన్లు ఉంటాయి. HYD, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు, AP, కర్ణాటక, MHలకు ప్రత్యేక బస్సులు నడుపుతాం. ఇవి MGBS, JBS, LB నగర్, ఉప్పల్, ఆరాంఘర్, సంతోష్‌నగర్, KPHB తదితర శివారు ప్రాంతాల నుంచి అందుబాటులో ఉంటాయి' అని తెలిపారు.