సంక్రాంతి రోజున మరణిస్తే.. పునర్జన్మ ఉంటుందా!
సంక్రాంతి రోజున భక్తులు నదీతీరాన పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇలా పుణ్య స్నానాలు ఆచరిస్తే వారు చేసిన పాపాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. ఇంకా ఆ రోజున బెల్లం, లడ్డూలను తయారు చేసి ఇరుగుపొరుగువారికి పంచుతారు. విభేదాలు ఉన్నప్పటికీ అంతా కలిసే ఉండాలని, సామరస్యతతో మెలగాలని ఇది సూచిస్తుంది. హిందువుల నమ్మకం ప్రకారం మకర సంక్రాంతి రోజున ఎవరైనా మరణిస్తే వారికి పునర్జన్మ ఉండదని నేరుగా స్వర్గానికి వెళతారని పురోహితులు చెబుతున్నారు.