స్టార్ హీరో కొడుకుతో శ్రీలీల డేటింగ్.. నిజమిదే (వీడియో)
స్టార్ హీరోయిన్ శ్రీలీల.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో యంగ్ హీరోతో ఈ ముద్దుగుమ్మ డేటింగ్ లో ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే మూవీ విషయమై ముంబైకి వెళ్లిన శ్రీలీల ఆయనను కలిసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. అంతకుమించి వారి మధ్య మరేమీ లేదని తెలిపాయి. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో 3 సినిమాలకు సైన్ చేశారు.