Apr 09, 2025, 13:04 IST/
కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలి హత్య
Apr 09, 2025, 13:04 IST
కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మాదేవి (32) హత్యకు గురయ్యారు. బీహార్ రాష్ట్రం గయాలోని ఆమె ఇంట్లో భర్త కాల్పులు జరపడంతో ఆమె మరణించారు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో భర్త రమేశ్ సింగ్ పిస్టోల్ తీసుకొని సుష్మాపై కాల్పులు జరిపినట్లు మృతురాలి సోదరి పూనమ్ కుమారి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.