Apr 11, 2025, 03:04 IST/వరంగల్ (ఈస్ట్)
వరంగల్ (ఈస్ట్)
వరంగల్: నకిలీ కంటి డాక్టర్ పై కేసు
Apr 11, 2025, 03:04 IST
సరైన వైద్య విద్యా అర్హతలు లేకుండా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న వరంగల్ డెక్కన్ ఆప్టికల్స్ యజమాని జనార్దన్ పై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ లాలయ్య, చైర్మన్ మహేశ్ ఫిర్యాదు మేరకు గురువారం సాయంత్రం మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. వరంగల్ జేపీఎన్ రోడ్డులో జనార్దన్ కంటి వైద్యుడి అవతారమెత్తి ప్రజలను మోసం చేస్తున్నట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు.