Apr 19, 2025, 16:04 IST/
ఏప్రిల్ 27న మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష
Apr 19, 2025, 16:04 IST
TG: రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్ష తేదీలను మోడల్స్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శనివారం ప్రకటించారు. ఏప్రిల్ 27 తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు ఏప్రిల్ 21 నుంచి హాల్ టికెట్లు telanganams.cgg.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. పరీక్షలు రోజుకి రెండు దఫాలుగా జరగనున్నట్లు పెర్కొన్నారు.