కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సుమారు 85 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మితో కుటుంబంలో ఆర్ధికంగా బలోపేతం అవ్వడానికి ఉపయోగపడుతుందని అన్నారు.