
కన్నుల పండుగగా గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం
ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తొర్రూరు పట్టణ కేంద్రంలోని సంతాన వేణుగోపాలస్వామి ఆలయ సన్నిధిలో సోమవారం అంగరంగ వైభవోపేతంగా శ్రీ గోదాదేవి సహిత రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రామాచార్యు లు, శ్యామ్ కుమారాచార్యుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ రంగనాథ స్వామి గోదాదేవి మెడలో మాంగల్య ధారణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్చకులు రాజేష్ ఆచార్యులు, కిరణ్ కుమారాచార్యులు, పనింద్రచార్యులు, ఓలేటి లక్ష్మణాచార్యులు, శేషాచార్యులు, కాటూరి కృష్ణమాచార్య తదితరులు పాల్గొన్నారు.