ఆర్టీసీకి ఇప్పటికే రూ.1,375 కోట్లు కట్టాం: భట్టి
తెలంగాణలోని ప్రభుత్వ హాస్టళ్లు, స్కూళ్లలో పెరిగిన ధరలకు అనుగుణంగా 40% డైట్ చార్జీలను పెంచామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్షి పథకాన్ని అమలుచేస్తున్నాం. ఆర్టీసీకి ఇప్పటికే రూ.1,375 కోట్లు కట్టాం' అని చెప్పారు.