మానవత్వం మంటగలిసిపోతోంది. రోజురోజుకూ మానవ బంధాలు, అనుబంధాలకు విలువ లేకుండా పోతోంది. భార్యను భర్త, అన్నను తమ్మడు, తల్లిదండ్రులను పిల్లలు కడతేర్చడానికి కూడా వెనకడాటం లేదు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఆ కుటుంబంలో పెను విషాదాన్ని మిగుల్చుతున్నాయి. కాబట్టి తొందరపాటులో నిర్ణయాలు తీసుకోవద్దని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.