ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఒక మహిళ హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న ఓ పోలీస్ అధికారి అక్కడికి వచ్చి, టవర్ ఎక్కి ఆ మహిళ ప్రాణాలను కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భర్తతో గొడవ తర్వాత ఆ మహిళ టవర్ ఎక్కిందని పోలీసులు తెలిపారు. లాలాపూర్ పీఎస్ పరిధిలోని ఛతారా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.