కదులుతున్న రైలుపై ఓ మహిళ పరిగెడుతూ డ్యాన్స్ కూడా చేసింది. బంగ్లాదేశ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆమె పిచ్చిది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. రియల్ లైఫ్ ‘సబ్వే సర్ఫర్స్ గేమ్’ అంటూ మరి కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.