చైనాలో ఝాంగ్ అనే వ్యక్తి ఓ కెమికల్ ఫ్యాక్టరీలో డిపార్ట్ మెంట్ మేనేజర్ గా 20 ఏండ్లుగా పనిచేస్తున్నాడు. ఆఫీసులో అదేపనిగా వర్క్ చేయడంతో ఓ రోజు ఝాంగ్‌కు కాస్త అలసటొచ్చి రెప్ప వాల్చాడు. దీని కారణంగా అతన్ని కంపెనీ విధుల నుంచి తొలగించింది. ఆ మాత్రానికే తొలగిస్తారా? అంటూ ఝాంగ్ కోర్టుకెక్కగా అతనికి అనుకూలంగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. అలా అతడికి రూ.41.6 లక్షల పరిహారం దక్కింది.