టీచర్ కుర్చి కింద బాంబు పెట్టి పేల్చేసిన విద్యార్థులు
హర్యానాలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న కొందరు విద్యార్థులను మహిళా లెక్చరర్ ఓ విషయంలో మందలించారు. అది మనసులో పెట్టుకున్న విద్యార్థులు ఆమె కుర్చీ కింద బాంబుపెట్టి రిమోట్ కంట్రోల్‌తో పేల్చారు. అదృష్టవశాత్తూ ఆమె తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో విద్యార్థుల్ని వారంపాటు సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నరేష్ మెహతా తెలిపారు.