సనాతన ధర్మాన్ని కాపాడటంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు ఆలయాలు దర్శించుకున్నానని మహిళా అఘోరీ తెలిపారు. ఏపీలోని తణుకులో శ్రీశ్రీశ్రీ రాజేష్ నాథ్జీ (ఉజ్జయిని) అఘోరీని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. తన పోరాటానికి ఆయన కూడా మద్దతు తెలియజేసినట్లు నాగసాధు మహిళా అఘోరీ స్పష్టం చేశారు.