15 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు.. సగం సీట్లలో ఎన్డీఏ హవా
మహారాష్ట్ర, ఝార్ఖండ్ల అసెంబ్లీ ఎన్నికలతో సహా 15 రాష్ట్రాల్లో 48 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాలకు 20న ఉప ఎన్నికలు జరగ్గా శనివారం ఫలితాలు వెలువడ్డాయి. మహారాష్ట్రలో మహాయుతి, ఝార్ఖండ్లో విపక్ష కూటమి విజయం సాధించాయి. అయితే అస్సాం, బీహార్, రాజస్థాన్, యూపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో మెజార్టీ స్థానాలు ఎన్డీయే గెలుచుకోగా కర్ణాటకలో 3 స్థానాలకు గాను మూడింటినీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది.