AP: తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మండపేట నియోజకవర్గానికి చెందిన దాదాపు 100 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి జనసేనలో చేరారు. జనసేన ముఖ్య నేత వేగుళ్ల లీలాకృష్ణ వారికి పార్టీ కండువాలు కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి విధానాలకు ఆకర్షితులై తాము జనసేనలో చేరినట్లు సదరు నాయకులు తెలిపారు.