ప్రముఖ కెమెరామెన్ మృతి
బుల్లితెరపై ఎన్నో సూపర్‌హిట్ సీరియల్స్‌కి కెమెరామెన్‌గా పనిచేసిన పోతన వెంకటరమణ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ బుధవారం మరణించారు. ఋతురాగాలు, సంసారం సాగరం, సిరి, బొమ్మరిల్లు వంటి హిట్ సీరియల్స్‌కి కెమెరామెన్‌గా పనిచేసారు. శ్రీ వైనతేయ అనే సీరియల్‌కి బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా నంది అవార్డు అందుకున్నారు. ఎడిటర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా పలు సినిమాలకు పనిచేశారు.