Gmailకు పోటీగా ఎలాన్ మస్క్ ‘ఎక్స్ మెయిల్’
Gmailకు పోటీగా కొత్తగా Xmailను తీసుకురానున్నట్లు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. 'సంప్రదాయ మెయిల్స్ కాకుండా మెసేజింగ్‌కు వాడుతున్న చాటింగ్ ఫార్మాట్లో మెయిల్స్ ఉంటాయి. చాలా సింపుల్ డిజైన్‌లో అందరికీ సులువుగా అర్థమయ్యేలా ఉంటుంది. మెసేజింగ్, ఈమెయిలింగ్ వంటి వాటన్నింటిపై మనం పునరాలోచించాల్సిన అవసరం ఉంది' అని మస్క్ పేర్కొన్నారు.