AP: రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో అభ్యర్థుల వివరాలు స్పష్టమయ్యాయి. 27 జిల్లాల్లోని 4,975 గ్రామ పంచాయతీలకు గాను 1,171 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. అంటే 23.53 శాతం స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 3,803 స్థానాలకు 10,292 మంది పోటీలో ఉన్నారు. వార్డు సభ్యుల విషయానికొస్తే 49,318 స్థానాల్లో 19,651 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు పోటీ ఉంది. ఈనెల 29న రెండో దశ పోలింగ్ జరగనుందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.