AP: స్థానిక ఎన్నికల వేళ టీడీపీకి షాక్ తగిలింది. వైసీపీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. వైఎస్సార్ కడప నగరంలో టీడీపీకి చెందిన చాంద్ బాషా, వహీద్, అన్వర్‌తో సహా సుమారు 120 కుటుంబాలు వైసీపీలో చేరారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ.. వైసీపీలో చేరికలతో పార్టీ మరింత బలపడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని అన్నారు.