పొదిలి వైసీపీ రాళ్ల దాడి ఘటనలో మరో 15 మంది అరెస్ట్‌

AP: వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ప్రకాశం జిల్లా పొదిలిలో ఈనెల 11న వైఎస్ జగన్‌ పర్యటనలో మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి జరిగింది. రోడ్డు పక్కన నిరసన తెలిపిన మహిళలపై వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి రాళ్లు, చెప్పులతో దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో గురువారం 9మందిని అరెస్టు చేయగా.. ఇవాళ మరో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్