చిత్తూరులో 19 ఏనుగుల సంచారం.. ప్రజల్లో భయాందోళనలు!

AP: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలాన్ని 19 ఏనుగులు చుట్టుముట్టడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తమిళనాడు వైపు నుంచి వచ్చిన 16 ఏనుగుల గుంపు పెద్దూరు అటవీ ప్రాంతంలో సంచరిస్తోంది. వీటితో పాటు గొల్లపల్లి సమీపంలో రెండు ఏనుగులు, పెద్దూరు పరిసరాల్లో మరొక ఒంటరి ఏనుగు తిష్ట వేశాయి. ఈ ఏనుగులు పెద్దూరు, ఆరిమాని పెంట, జీడిమకులపల్లి, ననియాల, రామాపురం తండాల వైపు చొచ్చుకువచ్చే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్