ఏపీలోని 9,829 MPTC స్థానాల్లో 1,985 ఏకగ్రీవం

AP: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కీలక గణాంకాలు వెల్లడయ్యాయి. మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాల్లో 1,985 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 7,844 స్థానాలకు 18,952 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే, రాష్ట్రంలోని మొత్తం 659 జెడ్పీటీసీ స్థానాల్లో 77 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 జెడ్పీటీసీ స్థానాల కోసం 2,169 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ప్రక్రియ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕